సూర్యకిరణాలు ప్రతి ఉదయాన్ని
కొత్తగా పరిచయం చేస్తుంది
కానీ ప్రతి ఉదయం
పరిమళించే పూల తోట అవ్వదు
ఒక్కోసారి ముళ్ళబాట కూడా అవ్వచ్చు
వెలుగులో ఉండే నీడ చీకట్లో ఉండదు
చీకట్లో ఉండే భయం వెలుగులో ఉండదు
ఎందుకంటే మనిషికి తోడు నీడ కాదు
తనలో ఉండే ధైర్యం
అదే ధైర్యం కారుచీకట్లో తనని
నడిపించే తోడు నీడ అవుతుంది
అదే జీవిత పాఠాల్ని నేర్పిస్తుంది.