రంగుల్లేని అక్షరానికి
ఇంద్రధనస్సులా రంగులద్దేది కవిత్వం
జారే కన్నీటికి, ఎగిసిపడే అలలకి
సంద్రంలా రుచి చూపేది కవిత్వం
కళ్ళల్లో కాంతికి, మూగబోయిన మనసుకి
ఆరుబయట ముగ్గులేసేది కవిత్వం
అంబరాన్ని అంటిన సంబరం తో
ఆనందాల హరివిల్లు కవిత్వం
చుక్కల్లేని ఆకాశంలో
చంద్రుడు నువ్వు, వెన్నెల నేను
జత కడితే కవిత్వమే కవిత్వం.